ప్రస్తుతం కష్టాల్లో ఉన్న గీత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికు ఆ సంఘం సభ్యులు వినతిపత్రం అందించారు. జైగౌడ్ రాష్ట్ర ఉద్యమ ఉపాధ్యక్షుడు నంగెడ్డ రంగారావు ఆధ్వర్యంలో కొత్తపేట ఎమ్మెల్యేను కలిశారు. రాష్ట్రంలో గీత కార్మికులు దాదాపు లక్ష ఇరవై వేల మంది టీసీఎస్, టీఎఫ్టీ లైసెన్స్ కలిగిన వారికి లాక్డౌన్ సమయంలో ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలను చేపట్ట లేదన్నారు. లాక్డౌన్ సమయంలో గీత కార్మికులపై ఎక్సైజ్ పోలీసులు బలవంతంగా పెట్టిన కేసులు రద్దు చేయాలని విన్నవించారు. అంతేకాకుండా బీసీలలో వివిధ కులవృత్తులు చేసుకుంటున్న వారికి ఆర్థిక సహాయంగా ఇస్తున్న పది వేల రూపాయలు గీత కార్మికులకు ఇవ్వాలని కోరారు. అనంతరం సంఘ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు.
'మాకూ రూ. 10 వేల ఆర్థిక సాయం అందించండి' - kothapeta mla latest news
కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బందులు పడుతున్న గీత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని జైగౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రంగారావు కోరారు. రంగారావు ఆధ్వర్యంలో కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డిని కలిశారు. లాక్డౌన్ సమయంలో గీత కార్మికులు పడిన కష్టాలను ఎమ్మెల్యేకు తెలియజేశారు.
కొత్తపేట ఎమ్మెల్యేను కలిసిన గీత కార్మికులు