తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం, ధవళేశ్వరం ప్రాంతాల్లో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. అధికారులు ఇప్పటికే ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాజమహేంద్రవరంలోని పుష్కర్ ఘాట్, ఇస్కాన్ టెంపుల్ ఘాట్ల వద్దకు సందర్శకులను పోలీసులు అనుమతించటంలేదు. ఎవరూ ఆ పరిసర ప్రాంతాలకు రాకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. వరద ఉధృతి పెరగిన కారణంగా... గోదావరి లంక గ్రామాలైన కేతవారిలంక, బ్రిడ్జిలంకల్లో నివాసముంటున్న 180 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కమిషనర్ సుమిత్ కుమార్ గాంధీ శనివారం ఏర్పాట్లు పరిశీలించారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మధ్యాహ్నం రెండు గంటలకు నీటి మట్టం 12 అడుగులకు చేరింది. దిగువకు 10 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.
ధవళేశ్వరం నుంచి 10 లక్షల క్యూసెక్కుల విడుదల
గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. క్షణక్షణానికి నీటిమట్టం పెరుగుతోంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు.
అధికారుల చర్యలు