ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోదావరి మళ్లీ ఉగ్రరూపం...లంక గ్రామాల్లో అలజడి

గోదావరికి వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. ఆగస్ట్ నెలలో దాదాపు పక్షం రోజుల పాటు వరద కష్టాలు అనుభవించిన ముంపు మండలాల, కోనసీమ లంక గ్రామాలు ప్రజలు మళ్లీ వస్తున్న వరదతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు

By

Published : Sep 7, 2019, 3:30 PM IST

ఉగ్రరూపం దాలుస్తున్న గోదావరి.... అలజడిలో లంక గ్రామాల ప్రజలు

ఉగ్రరూపం దాలుస్తున్న గోదావరి.... అలజడిలో లంక గ్రామాల ప్రజలు

ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతోంది. ఆగస్టు నెలలో ఉగ్రరూపం దాల్చిన గోదావరి వరద ఉద్ధృతితో మళ్లీ పోటెత్తుతోంది. దేవీపట్నం మండలంలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో చాలామంది తమ సామగ్రిని తరలిస్తున్నారు.

పోలవరం కాఫర్ డ్యామ్‌ వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. వచ్చిపడుతున్న వరదతో ప్రవాహం ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది.

గోదావరికి వరద మళ్లీ పెరగడంతో కోనసీమ ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. పి.గన్నవరం నియోజకవర్గం చాకలిపాలెం సమీపంలోని కాజ్​వేపై వరద జోరుగా ప్రవహిస్తోంది. కనకాయలంక గ్రామ ప్రజలు నాటు పడవలపై ప్రయాణం చేస్తున్నారు. కోనసీమలో వశిష్ఠ, వైనతేయ, గౌతమి గోదావరి నదీపాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.

ఇదీ చదవండి

అమరావతిపై బొత్స మళ్లీ కీలక వ్యాఖ్యలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details