బాలికను బలిగొన్న చెరువు - east godavari
నిన్నటివరకూ ఆడుతూ, పాడుతూ తిరిగిన బాలిక నేడు విగతజీవిలా మారింది. వర్షంలో ఆడుకుంటూ నిన్న కనిపించకుండా పోయిన మూడేళ్ల పాప.. చెరువులో మృతదేహమై కనిపించింది.
మృతిచెందిన పాప
తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం ముక్కోలు గ్రామంలో నిన్న అదృశ్యమైన బాలిక... గోకివాడ వద్ద పంట కాలువలో శవమై కనిపించింది. ముక్కోలుకు చెందిన గంట అప్పన్న కుమార్తె పార్వతి నిన్న సాయంత్రం అదృశ్యం అయ్యింది. 3 ఏళ్ల తమ పాప వర్షంలో ఆడుకుంటూ కనిపించకుండా పోయిందని తల్లిదండ్రులు.. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈరోజు బాలిక ఆచూకీ కోసం తల్లిదండ్రులు, గ్రామస్థులు వెతకగా చెరువులో శవమై కనిపించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.