తెలుగు భాషపై పట్టు సాధించిన ఫ్రెంచి దేశీయుడు డేనియల్ నెజర్స్ తన కృషి కొనసాగిస్తున్నారు. ఇప్పటికే తెలుగు - ఫ్రెంచ్ భాషల నిఘంటువు ఆవశ్యకతను గుర్తించి దానిని పూర్తి చేసే పనిలో ఉన్నారు. తాజాగా... యానాం రచయిత దాట్ల బుచ్చిబాబు రచనల్ని ఫ్రెంచ్‌లోకి అనువదించే బాధ్యత చేపట్టారు. ఒకప్పుడు ఫ్రెంచ్ పాలిత ప్రాంతమైన యానాంతో ఆ దేశానికి ఎంతో అనుబంధం ఉంది. అప్పటి చారిత్రక ఉదంతాలు, విశేషాలతో యానాంకు చెందిన కవి, కథా రచయిత దాట్ల దేవదానం రాజు... యానాం కథలు, కళ్యాణపురం పేరుతో పుస్తకాలు రాశారు. ఇప్పుడు ఆయా కథల్ని డేనియల్ నేజర్స్ ఫ్రెంచ్‌లోకి అనువదిస్తున్నారు.
'ఫ్రెంచ్ నోట...తెలుగు మాట'
ఫ్రాన్స్ నుంచి వచ్చారు.. తెలుగు భాషపై పట్టు సాధించారు.. ఇప్పుడు ఆ కృషిని మరింత మందుకు తీసుకెళుతూ ఆకట్టుకుంటున్నారు. ఖండాంతరాలు దాటి మరీ తెలుగు భాషపై ప్రేమ చాటుకుంటున్న డేనియల్ నేజర్స్ ప్రస్థానం ఎలా మొదలైంది.
french-professor
డేనియల్ నేజర్స్ పారిస్‌లో సోషియో - కల్చరల్, ఆంత్రోపాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. వివిధ దేశాల్లోని 100 పురాతన భాషల్ని అధ్యయనం చేస్తున్న ఇనాల్కో సంస్థలో సభ్యుడుగా ఉన్న నేజర్స్.... తెలుగు భాష, జానపద సాహిత్యం, నాటకాలపై 3 దశాబ్దాలుగా అధ్యయనం చేస్తున్నారు. భారత ప్రభుత్వం రాష్ట్రపతి పురస్కారంతో ఆయనను సత్కరించింది. తెలుగు - ఫ్రెంచ్ నిఘంటువు పనిని ప్రస్తుతం సగానికి పైగా పూర్తి చేసినట్లు డేనియెల్ నెజర్స్ తెలిపారు.