ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దివ్యాంగులకు వరంగా... కృత్రిమ అవయవాలు ఉచితంగా - రంగరాయ వైద్య కళాశాలలో ఉచిత కృత్రిమ అవయవ పంపిణీ శిబిరం న్యూస్

దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను ఉచితంగా అందజేస్తున్నారు. వీల్​ఛైర్లు, సహాయ కర్రలు వంటి పరికరాలూ పంపిణీ చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

free artificial organs distribution
ఉచిత కృత్రిమ అవయవ పంపిణీ కార్యక్రమం

By

Published : Feb 13, 2020, 2:12 PM IST

ఉచిత కృత్రిమ అవయవ పంపిణీ

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం.. రెండో రోజూ కొనసాగింది. భగవాన్ మహావీర్ వికలాంగుల సేవా సమితి, ఓఎన్జీసీ ఆధ్వర్యంలో సంయుక్తగా నిర్వహిస్తున్న ఈ శిబిరానికి పెద్ద ఎత్తున దివ్యాంగులు హాజరై సేవలు పొందారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న విభిన్న ప్రతిభావంతులకు ఉచితంగా అవయవాలు పంపిణీ చేయటంపై ఆనందించారు.

కృత్రిమ అవయవాలకు ప్రసిద్ధి పొందిన జైపూర్ నుంచి 19 మంది ఫిజియోథెరిపీ వైద్యులు, 8మంది సాంకేతిక నిపుణులతో శిబిరాన్ని కొనసాగించారు. దివ్యాంగుల కొలతలు తీసుకొని, గంటల వ్యవధిలోనే వారికి తగిన అవయవాలు సిద్ధం చేసి ఇచ్చారు. కృత్రిమ అవయవాలతోపాటు వీల్​ఛైర్లు, సహాయ కర్రలు వంటి పరికరాలు ఉచితంగా అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details