ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వంపై నమ్మకం లేకే రాష్ట్రపతికి లేఖ: హర్షకుమార్​ - మాజీ ఎంపీ హర్షకుమార్ వార్తలు

తనకు న్యాయం చేయాలని రాష్ట్రపతికి లేఖ రాసే హక్కు కూడా శిరోముండనం బాధితుడికి లేదా అని మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రశ్నించారు. ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడం వల్లే బాధితుడు లేఖ రాశాడని ఆయన అన్నారు. 24 గంటల్లో నిందితుల్ని అరెస్ట్ చేస్తామన్న ప్రభుత్వం... ఇన్ని రోజులు ఏం చేసిందని నిలదీశారు. న్యాయం కోసం పోరాటం చేస్తుంటే యువకుడిపై చర్యలు తీసుకుంటామని చెప్పడం తగదని హర్షకుమార్ అన్నారు.

హర్షకుమార్​
హర్షకుమార్​

By

Published : Aug 11, 2020, 6:10 PM IST

Updated : Aug 11, 2020, 6:30 PM IST

నక్సలైట్లలో కలిసిపోతానని శిరోముండనం బాధితుడు వరప్రసాద్‌ రాష్ట్రపతికి లేఖ రాయడంపై మాజీ ఎంపీ హర్షకుమార్‌ స్పందించారు. ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడం వల్లే వరప్రసాద్‌ అలాంటి లేఖ రాశారన్నారు. బాధితులకు ప్రభుత్వం ఇచ్చే భరోసా ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. 24 గంటల్లో దోషులను పట్టుకుంటామని చెప్పి.. తర్వాత మరచిపోయారని విమర్శించారు. కనీసం బాధ్యులను కూడా అరెస్టు చేయలేదని హర్షకుమార్‌ ఆరోపించారు. రాష్ట్రంలో ఇన్ని ఘటనలు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పోలీసుస్టేషన్‌లో ఎస్సీ యువకుడికి శిరోముండనం చేస్తే కనీసం పట్టించుకోరా అని నిలదీశారు.

రాష్ట్రపతికి ఉత్తరం రాసినందుకు ఆ యువకుడిపై చర్యలు తీసుకుంటామంటారా? న్యాయం కోసం రాష్ట్రపతికి ఉత్తరం రాసే హక్కు కూడా లేదా? ఎస్సీలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఈ ఘటనలన్నీ ముఖ్యమంత్రికి కనిపించట్లేవా?. ---హర్షకుమార్, మాజీ ఎంపీ.

ప్రతిచోట అమరావతే రాజధాని అని ప్రజలను నమ్మించారని హర్షకుమార్‌ ఆరోపించారు. తీరా అధికారంలోకి వచ్చాక మాట మార్చారన్నారు. 3 రాజధానుల వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం మోసపూరిత చర్యలతో ప్రజలను మభ్యపెడుతుందని హర్షకుమార్‌ అన్నారు.

ఇదీ చదవండి:

'శిరోముండనం బాధితుడిని కొందరు బలి చేస్తున్నారు'

Last Updated : Aug 11, 2020, 6:30 PM IST

ABOUT THE AUTHOR

...view details