ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోదావరి వరదతో కోనసీమ వాసుల ఆందోళన - eastgodavari

గోదావరి వరదతో ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేశారు. దిగువున ఉన్న కోనసీమ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

వరద

By

Published : Sep 8, 2019, 7:15 PM IST

గోదావరి వరదతో కోనసీమ వాసుల ఆందోళన

ఆగస్టు నుంచి ఇప్పటివరకు వచ్చిన వరదలతో కోనసీమ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ పరిస్థితుల నుంచి ఇంకా తేరుకోకుండానే మళ్లీ ఇప్పుడు వరద రావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కోనసీమలో గౌతమి, వైనతేయ, వశిష్ఠ నది పాయలు వరద నీటితో పోటెత్తి ప్రవహిస్తున్నాయి. అయినవిల్లి మండలం వెదురుబీడు వద్ద కాజ్​వే ముంపు బారిన పడింది. పి గన్నవరం నియోజకవర్గంలోని చాకలి పాలెం సమీపంలో వంతెనపై నుంచి 2రోజులుగా వరదనీరు ప్రవహిస్తుండటంతో పశ్చిమగోదావరి జిల్లా కనకాయలంక ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. పంటపొలాల్లోకి వరదనీరు చేరుతోంది. అధికారులు తమను ఆదుకోవాలని ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం సబ్​కలెక్టర్ సలీంఖాన్ వచ్చి గ్రామస్థులతో మాట్లాడారు.

ABOUT THE AUTHOR

...view details