తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం లంకల గన్నవరం గ్రామానికి చెందిన వెర్రయ్య అనే వ్యక్తి వరద నీటిలో మునిగిపోయాడు. ఆ సమయంలో ఆయన భార్య భర్తను కాపాడింది. తీవ్ర అస్వస్థతకు గురైన వెర్రియ్యను పి. గన్నవరంలోని సామాజిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతనికి మెరుగైన వైద్యం కోసం అమలాపురంలోని ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.
వరద నీటిలో మునిగిపోయిన భర్త...కాపాడిన భార్య - పి.గన్నవరం వార్తలు
వరద ఉద్ధృతి రోజురోజూకీ పెరగుతోంది. ఈ నేపథ్యంలో వరద నీటిలో మునిగిపోయన తన ఇంటిని చూసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి నీటిలో చిక్కుకుపోయాడు. అతని భార్య కాపాడటంతో...హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తూర్పుగోదావరిజిల్లా లంకల గన్నవరంలో చోటుచేసుకుంది.
లంకల గన్నవరం
లంకల గన్నవరం పూర్తిగా వరద నీటిలో ఉంది. వెర్రయ్య ఇల్లు వరద నీటిలో మునిగిపోయింది. సురక్షిత ప్రాంతానికి వచ్చిన ఆ కుటుంబం... ఈరోజు వరద నీటిలో ఉన్న ఇంటిని చూసుకునేందుకు భార్యాభర్తలిద్దరూ వెళ్లారు. ఆ సమయంలో భర్త వెర్రయ్య ముంపు బారినపడ్డాడు. భార్య రక్షించడంతో బయటపడ్డాడు.