పుష్కరఘాట్ కూడలిలో ఫ్లాష్‌మాబ్ - majamahendravaram
రాజమహేంద్రవరం పుష్కరఘాట్ కూడలిలో చిన్నారుపై లైంగిక దాడులను నిరసిస్తూ ఫ్లాష్‌మాబ్ నిర్వహించారు. చేదోడు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిపారు.
పుష్కరఘాట్ కూడలిలో ఫ్లాష్‌మాబ్
చిన్నారులపై లైంగిక దాడులను నిరసిస్తూ రాజమహేంద్రవరం పుష్కరఘాట్ కూడలిలో చేదోడు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఫ్లాష్‌మాబ్ నిర్వహించారు. నగరంలోని వివిధ కళాశాలకు చెందిన విద్యార్ధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానంగా చిన్ననాటి నుంచి తల్లిదండ్రులు ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోవాలని... ఏవిధంగా కాపాడుకోవాలనే విషయాలను తెలిపారు. ఆదివారం సాయంకాలం కావడంతో ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో నృత్యంను తిలకించారు.