ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఐదు దేవాలయాల్లో చోరీ... హుండీల్లో నగదు అపహరణ

తూర్పుగోదావరి జిల్లా శ్రీరామపురం, శ్రీకృష్ణపట్నం గ్రామాల్లోని ఐదు దేవాలయాల్లో హుండీలను గుర్తు తెలియని వ్యక్తులు పగులగొట్టి దోచుకెళ్లారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

east godavari district
ఐదు దేవాలయాల్లో.. హుండీల దోపిడి

By

Published : May 22, 2020, 8:12 PM IST

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని వివిధ గ్రామాల్లో గుర్తు తెలియని దుండగులు ఐదు దేవాలయాల్లోని హుండీలు పగులగొట్టి దోచుకెళ్లారు. శ్రీకృష్ణపట్నంలో అభయ ఆంజనేయ స్వామి, కోదండ రామాలయం.. శ్రీరాంపురం గ్రామంలో వెంకటేశ్వర స్వామి గుడి, ప్రసన్న ఆంజనేయస్వామి గుడి, దుర్గమ్మ గుడిలో దోపిడీలు జరిగాయి. క్లూ టీమ్స్ వచ్చి ఆధారాలు సేకరించారు. ఆలయ కమిటీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ సుభాష్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details