ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోదావరిలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించిన అధికారులు

జీవనోపాధి కోసం చేపల వేటకు వెళ్లిన మత్స్యకార కుటుంబాలు తిరుగు ప్రయాణంలో గోదావరి వరదలో చిక్కుకుపోయాయి. విపత్తు నిర్వహక బృందాలు వీరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి.

By

Published : Aug 9, 2019, 11:53 PM IST

మత్స్యకారులు

గోదావరిలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించిన అధికారులు

పోలవరం కాపర్‌ డ్యాంలో చిక్కుకున్న 31మంది మత్స్యకారులను అధికారులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ధవళేశ్వరానికి చెందిన మత్స్యకారులు విలీన మండలాల్లో చేపల వేటకు వెళ్తుంటారు. గతేడాది డిసెంబరులో వెళ్లారు. 8 నెలలకు పైగా చేపల వేట సాగించి కూనవరం ప్రాంతం నుంచి బయలుదేరి వస్తుండగా కాపర్‌ డ్యాం వద్ద గోదావరిలో చిక్కుకుపోయారు. రాత్రి నుంచి అక్కడే ఉన్నారు. గోదావరి ఉధృతిలో రెండు బోట్లు కొట్టుకుపోయాయి. మత్స్యకారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఆర్తనాదాలు చేశారు. సమాచారం అందుకున్న ఉభయగోదావరి జిల్లాల అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. రాష్ట్ర, జాతీయ విపత్తుల నిర్వహకశాఖ అధికారులు, అగ్నిమాపక దళాలు, పోలీసు, రెవెన్యూ సిబ్బంది రంగంలోకి దిగారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. పశ్చిమగోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి, రంపచోడవరం ఆర్డీఓ శ్రీనివాసరావు, సీఐ ఆధ్వర్యంలో వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేశారు. రక్షించిన మత్స్యకారులను బస్సులలో ధవళేశ్వరానికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details