ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎండు చేపల తయారీనే జీవనోపాధిగా... - కోనసీమలో ఎండు చేపల తయారీ

ఎండు చేపలు, రొయ్యలు.. వీటి పేరు చెప్తే మాంసాహార ప్రియులకు నోరూరుతుంది. పచ్చి చేపలు, రొయ్యలను ఎండు చేపలు, రొయ్యలుగా మార్చే ప్రక్రియ అంత సులభమైనది కాదు. ఈ ప్రకియను వారసత్వంగా పొందుతున్నారు తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంత మత్స్యకార మహిళలు. తరాలుగా ఈ పనిని జీవనోపాధి ఎంచుకుంటున్నారు.

fisher womens
ఎండు చేపల తాయారీనే జీవనోపాధిగా

By

Published : Dec 29, 2020, 3:18 PM IST

Updated : Dec 29, 2020, 6:58 PM IST


కోనసీమలో ప్రధానంగా కాట్రేనికోన మండలం పల్లం పొర, బలుసు తిప్ప, తిప్ప చిర్ర, యానం, గచ్చకాయల పొర ... సముద్రతీర గ్రామాల్లోని వందలాది కుటుంబాలు మత్స్య సంపద మీద ఆధారపడి జీవిస్తున్నాయి. మగవారు సముద్రం, గోదావరిలో వేటాడి పచ్చి చేపలు, రొయ్యలు పట్టుకుంటారు. వీరి వద్ద నుంచి మత్స్యకార మహిళలు వాటిని కొనుగోలు చేసి ఎండు చేపలు, రొయ్యలుగా తయారుచేసి మార్కెట్లలో విక్రయిస్తారు. వీటికి డిమాండ్ ఎక్కువ మాంసాహార ప్రియులు వీటి పై అమిత ఆసక్తి చూపిస్తారు. వీటిని పలువురు హైదరాబాద్ విశాఖపట్నం వంటి దూర ప్రాంతాల తో పాటు అమెరికా... దేశాల్లో ఉన్న తమ బంధువులు స్నేహితులకు పంపుతారు . ఇవి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటాయి

తయారీ విధానం...

ప్రధానంగా వీటిని తయారు చేసేందుకు ట్రేలతో ఉండే ఇనుప అరల పెట్టెలను వినియోగిస్తారు. వీటిని జిటేకా పెట్టెలుగా వ్యవహరిస్తారు. కొనుగోలు చేసిన పచ్చి చేపలు, రొయ్యలు శుభ్రం చేసి, ఎండబెట్టి వాటిని ట్రేలు లో వరుసగా పేర్చి జిటేకా పెట్టెల్లో ఉంచుతారు. కింద మంట పెట్టి ఎంతో నేర్పరితనం తో వీటిని అరుస్తారు. మంటకు మడ కర్రలను వినియోగిస్తారు. ఉప్పు చేపలు, పండు గొప్పలు, చందు వాలు, కొమురయ్య పాములు, కొయ్యంగలు, కట్టి పరుగులు ఇలా వివిధ రకాల చేపలను ఎండు చేపలుగా తయారుచేస్తారు. రకాలను బట్టి బయట మార్కెట్లో కిలో ఎనిమిది వందల రూపాయల నుంచి 1200 రూపాయల వరకు వీటి ధర ఉంటుంది.

జీవనోపాధి

కోనసీమ ప్రాంతంలోని వందలాది మత్స్యకార కుటుంబాలు కుటీర పరిశ్రమగా ఏర్పడి ... వీటిని ఉత్పత్తి చేసి జీవనోపాధి పొందుతున్నారు. ప్రధానంగా వీటిని తయారు చేసేందుకు ఇనుప పెట్టెలు అత్యంత కీలకం. ప్రభుత్వం వీటిని అందించి ఆర్థిక సాయం చేస్తే ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు వీలు ఉంటుందని... వీటి తయారీలో నిమగ్నమైన మత్స్యకార మహిళలు కోరుతున్నారు.

ఎండు చేపల తాయారీనే జీవనోపాధిగా

ఇదీ చదవండీ...

అహో.. అరటిగెలల పందిరి!

Last Updated : Dec 29, 2020, 6:58 PM IST

ABOUT THE AUTHOR

...view details