తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం కొమానపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండు గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో 68 ఏళ్ల వృద్ధురాలు చంద్రకాంతం మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడింది. ఈ రెండు ఇళ్లలో నివాసముంటున్న ఐదు కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలాయి.
అగ్ని ప్రమాదంలో రెండు గుడిసెలు దగ్ధం - east godavari latest news
అగ్ని ప్రమాదంలో రెండు పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో ఓ వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది.
fire accident in komanapally east godavari district
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. గాయపడ్డ వృద్ధురాలిని అమలాపురం ఆస్పత్రికి తరలించారు. కష్టపడి దాచుకున్న నగదు మంటల్లో కాలిపోయిందని బాధితులు వాపోయారు. సుమారు 5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:గొంతులో ఇరుక్కుపోయిన మాంసం ముక్క.. తరువాత ఏమైందంటే..