తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం చిన్నింపేట జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో యర్రవరం గ్రామస్థుడు గ్రంధి కృపారావు (35), అతడి మూడేళ్ల కుమార్తె సంజన దుర్మరణం పాలయ్యారు.
ఆధార్ కార్డులో పేర్ల మార్పులు, చేర్పుల కోసం కృపారావు తన భార్య అమూల్య, కుమార్తె సంజనతో కలిసి శుక్రవారం ద్విచక్ర వాహనంపై ప్రత్తిపాడు మండలం ఒమ్మంగికి వెళ్తుండగా వీరి ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. తండ్రీ, కుమార్తె అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. తీవ్ర గాయాలైన అమూల్యకు ప్రత్తిపాడు ఆసుపత్రిలో చికిత్స చేసి కాకినాడ తరలించారు.