గుర్తుతెలియని వాహనం ఢీకొని రైతు మృతి చెందిన ఘటన ఆలమూరు మండలం చెముడులంకలో చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా చెముడులంక గ్రామానికి చెందిన బుడ్డిగ బూరయ్య... తాను పండించిన కూరగాయలను అమ్ముకోడానికి సైకిల్‌పై మడికి వెళ్తున్నాడు. తెల్లవారుజామున జాతయ రహదారిపై వచ్చేసరికి రావులపాలెం వైపుకు వెళుతున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన బూరయ్యను హైవే అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో కన్నుమూశాడు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని రైతు మృతి
పండించిన కూరగాయలు అమ్ముకునేందుకు వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని రైతు మృతి చెందాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో ఆలమూరు మండలంలో చోటు చేసుకుంది.
వాహనం ఢీకొని రైతు మృతి