లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవాలంటూ తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ పేదలకు భారంగా మారిందన్నారు. పేద ప్రజలను ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. లాక్డౌన్ వలన ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న ప్రతి కుటుంబానికి 5వేల రూపాయలు ఇవ్వాలనీ, మూసివేసిన అన్న క్యాంటీన్లు తెరవాలని డిమాండ్ చేశారు. రైతుల నుంచి ధాన్యం, అపరాలు ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. ఆక్వా, పౌల్ట్రీ రైతులను ఆదుకోవాలని సూచించారు. కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్య, పోలీస్, వైద్య సిబ్బంది, ఇతర అధికారులకు రక్షణ కిట్లు అందించాలని డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిరాహార దీక్ష
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. లాక్డౌన్ వలన ఇబ్బంది పడుతున్న ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలనీ, ప్రతి రైతు పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిరాహార దీక్ష