వైకాపా ప్రభుత్వం తుగ్లక్ నిర్ణయంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనుక్కు నెట్టివేసిందని తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. అచ్చంపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన... రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
అవన్నీ వైకాపా ప్రభుత్వం చేసిన హత్యలే: చినరాజప్ప
అమరావతి రైతులు 300 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవటం దారుణమని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. రాజధాని రైతులను సర్కార్ ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని మండిపడ్డారు.
ex minister nimmakayala chinarajappa
రాజధానికి భూములిచ్చిన రైతులు 300 రోజులుగా రోడెక్కి ఆందోళన చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తుండటం దుర్మార్గమని అన్నారు. అమరావతి రైతులను సర్కార్ ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. అమరావతి తరలిపోతుందన్న ఆవేదనతో ఇప్పటికి 90మందికిపైగా రైతులు ప్రాణాలు కోల్పోయారని చినరాజప్ప వివరించారు. ఈ మరణాలన్నీ సర్కార్ చేసిన హత్యలేనని ఆయన వ్యాఖ్యానించారు.