పర్యావరణ దినోత్సవం.. ప్రత్యేక ర్యాలీలు - environment day
తూర్పుగోదావరి జిల్లాలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సిఆర్పిఎఫ్ 42 బెటాలియన్ సిబ్బంది స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రావులపాలెంలో పారా సంస్థ సభ్యులు అవగాహన ర్యాలీ చేపట్టారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. సిఆర్పిఎఫ్ 42 బెటాలియన్ సిబ్బంది స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆస్పత్రిలో పరిసరాలు శుభ్రంగా ఉంటేనే రోగులు తక్కువ రోజుల్లో కోలుకుంటారని వారు తెలిపారు. సిఆర్పిఎఫ్ కమాండెంట్ రామకృషన్, డిప్యూటీ కమాండెంట్ ఉపేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ దినోత్సవం సందర్భంగా... 'పర్యావరణాన్ని కాపాడుదాం ప్లాస్టిక్‌ని నిషేదిద్దాం' అంటూ తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో పారా సంస్థ సభ్యులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక అమలాపురం రోడ్ నుండి కళా వెంకట్రావు సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.