తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం వెలుగు బందలో రాష్ట్ర స్థాయి ఎద్దుల బండి పోటీలు ఎంతో ఉత్కంఠగా నిర్వహించారు. వివిధ జిల్లాల నుండి పోటీదారులు హాజరయ్యారు. ప్రస్తుత కాలంలో అధునాతన యంత్రాల రాకతో ఎద్దులను పోషించుకోలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. స్వర్గీయ కూట్టి జగపతిరావు మెమోరియల్ అభయాంజనేయ పేరుతో రాష్ట్ర స్థాయి ఎద్దుల బండి పోటీలు ఏర్పాటు చేసినందుకు రైతులు ఆనందం వ్యక్తం చేశారు. సీనియర్ విభాగంలో 15వందల మీటర్లు, జూనియర్ విభాగంలో వెయ్యి మీటర్లు, ఎడ్లబండి పరుగు పోటీ నిర్వహించారు. సీనియర్ విభాగంలో మొదటి బహుమతి 20వేలు, రెండో బహుమతి 15 వేలు, మూడో బహుమతి 12 వేలు, నాలుగో బహుమతి 10 వేలు, అయిదో బహుమతి 8 వేలు అందజేశారు.
ఉత్కంఠగా రాష్ట్రస్థాయి ఎడ్లబండి పోటీలు - eastgodavari
తూర్పుగోదావరి జిల్లా వెలుగుబందలో రాష్ట్రస్థాయి ఎద్దుల బండిపోటీలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పోటీదారులు హాజరయ్యారు.
ఎద్దులబండి పోటీలు