పర్యాటక రంగ అభివృద్ధికి ప్రణాళికలు - తూర్పు గోదావరి
తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న యానాంలో పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్ర నిధులతో ప్రణాళికలు సిద్ధం చేసి పనులు చేపట్టారు.
పర్యాటక రంగ అభివృద్ధికి ప్రణాళికలు
తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న యానాంలో పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్ర నిధులతో ప్రణాళికలు సిద్ధం చేసి పనులు చేపట్టారు. 25 కోట్లతో నిర్మించిన యానాం టవర్ను ఆనుకొని ఉన్న 18 ఎకరాల స్థలంలో పలు అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. బొటానికల్ గార్డెన్, చిల్డ్రన్ పార్క్, మ్యూజికల్ ఫౌంటెన్ నిర్మాణాలు ఊపందుకున్నాయి. సుమారు 15 కోట్ల వ్యయంతో జరుగుతున్న పనులు ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని పుదుచ్చేరి పర్యాటక శాఖ నిర్ణయించింది.