ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరదతో ఇబ్బందుల్లో లంక గ్రామాల ప్రజలు - east godavari

తూర్పు గోదావరి జిల్లాలో వరదతో లంక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరద పెరుగుతున్న క్రమంలో కాజ్ వే మళ్లీ ముంపు బారిన పడింది.

problems

By

Published : Aug 8, 2019, 10:39 AM IST

Updated : Aug 8, 2019, 12:54 PM IST

వరదతో ఇబ్బందుల్లో లంక గ్రామ ప్రజలు

గోదావరి వరద.. తగ్గుతున్నట్టే కనిపిస్తున్నా.. అంతలోనే పెరుగుతోంది. పై ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. గోదారి ప్రవాహం ఎప్పుడు శాంతిస్తుందో.. ఎప్పుడు ఉధృతంగా మారుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఫలితంగా.. తూర్పు గోదావరి జిల్లా కోనసీమ లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ ఉదయం నుంచి కాజ్‌ వేలు మళ్లీ ముంపు బారిన పడ్టాయి. చాకలి పాలెం వద్ద కాజ్‌ వే ఎనిమిది రోజులుగా ఉప్పు నీటిలో ఉంది. ముక్తేశ్వరం వద్ద కాజ్‌ వే మీదకు వరద నీరు చేరుతోంది. బురుగులంక వద్ద నెలకొన్న ఈ పరిస్థితితో.. పరిసర గ్రామాల ప్రజల రాకపోలకు ఇబ్బందిగా మారింది.

Last Updated : Aug 8, 2019, 12:54 PM IST

ABOUT THE AUTHOR

...view details