తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మండలం కాతేరులోని శ్యామలాంబ చెరువుకు గండి పడింది. కాతేరు ప్రధాన రహదారిపై కల్వర్టు నిర్మిస్తున్నారు. చెరువు నుంచి మురుగు నీరు బయటకు రాకుండా అడ్డుకట్ట వేయడంతో చెరువుకు గండి పడ్డాది. దీంతో సమీప కాలనీలోకి మురుగునీరు వెళ్లడంతో అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు . కాలనీ లోతట్టుగా ఉండటంతో చిన్నపాటి వర్షాలకు కూడా నీట మునుగుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం ఆలస్యంగా తెలియడంతో స్పందించిన పంచాయతీ కార్యదర్శి హనుమంతరావు అక్కడికి చేరుకొని గండిని పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మురుగు నీరంతా ఈ చెరువులో నిల్వ ఉండి బయటకు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో గండి పడిందని పంచాయతీ కార్యదర్శి తెలిపారు.
కాలనీలోకి మురుగునీరు...ప్రజలు బేజారు - rahadari
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మండలం కాతేరులోని ప్రధాన రహదారిపై కల్వర్టు నిర్మిస్తుండటంతో చెరువు నుంచి మురుగు నీరు బయటకు రాకుండా అడ్డుకట్ట వేశారు. దీంతో కాతేరులోని శ్యమలాంబ చరువుకు గండి పడి సమీప కాలనీలోకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి.
కాలనీలోకి మురుగునీరు...ప్రజలు బేజారు