తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో 20కేఎల్ సామర్థ్యం ఉన్న ఆక్సిజన్ ప్లాంట్‌ను బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రారంభించారు. అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ అధినేత సత్యనారాయణమూర్తి 46 లక్షల వ్యయంతో దాన్ని సమకూర్చారు. జీజీహెచ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ప్రాంగణంలో ఆక్సిజన్ ట్యాంకును ఏర్పాటు చేశారు. ఆస్పత్రికి ఆక్సిజన్ ప్లాంట్‌ను అందించిన సంస్థను మంత్రి అభినందించారు.
కాకినాడ జీజీహెచ్‌కు 20కేఎల్ ఆక్సిజన్ ప్లాంట్ విరాళం...
కాకినాడలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఆక్సిజన్ ఉత్పత్తి ట్యాంకును బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణు గోపాలకృష్ణ ప్రారంభించారు. అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ అధినేత సత్యనారాయణమూర్తి 20కేఎల్ సామర్థ్యమున్న ఆక్సిజన్ ట్యాంకును ఆస్పత్రికి విరాళంగా అందించారు.
కరోనా నివారణకు వైద్యులు, పోలీసులు, అధికారులు చర్యలు తీసుకుంటున్నారని.. వారికి ప్రజలు సహకరించాలని కోరారు. అన్నీ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ జిల్లాలో కరోనా పాజిటివిటీ రేటు 10శాతం దాకా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొవిడ్‌ను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా కలెక్టర్ మరిన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. జీజీహెచ్ అవసరాల మేరకు వెంటిలేటర్లు, ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్టు అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ సంస్థ అధినేత సత్యనారాయణ తెలిపారు.
ఇదీ చదవండి:Corona effect: ఈ ఇద్దరి కష్టం.. ఇంకెవరికీ రాకూడదు!