కేంద్ర ప్రభుత్వ ఎన్ఎంసీ బిల్లును వ్యతిరేకిస్తూ... కాకినాడలో వైద్యులు ధర్నా నిర్వహించారు. బిల్లును ఉపసంహరించుకోవాలని నగరంలోని రంగరాయ వైద్య కళాశాల విద్యార్థులు, జూనియర్ వైద్యులు ఆందోళన చేపట్టారు. 24 గంటలపాటు సాధారణ సేవలు నిలిపివేసి నిరసన తెలియజేశారు. జీజీహెచ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జెడ్పీ సెంటర్లో మానవహారం చేపట్టారు. ఎన్ఎంసీ బిల్లు అమలు వైద్యరంగానికి తీరని చేటన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం తమ ఆలోచనలను ఉపసంహరించుకోవాలని కోరారు.
ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా వైద్యుల నిరసన
జాతీయ వైద్య కమిషన్ బిల్లుకు వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వైద్యులు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తక్షిణమే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరారు.
వైద్యుల నిరసన