ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాధితులను పరామర్శించిన జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి - eluru government hospital news

తూర్పుగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి బాలకృష్ణయ్య పరామర్శించారు. బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

District Secretary of the Judiciary
న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి

By

Published : Dec 7, 2020, 3:49 PM IST

ఆకస్మిక అనారోగ్య కారణాలతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన వారిని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి బాలకృష్ణయ్య పరామర్శించారు. ఆస్పత్రి పర్యవేక్షకులు ఏవీఆర్ మోహన్​ను పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సమస్యకు కారణం ఏంటని.. ఎప్పటిలోపు పూర్తి సమాచారం వస్తుందని ఆరా తీశారు. పరీక్షల కోసం నమూనాలను పంపించారని..రిపోర్టులు వచ్చాకే స్పష్టమైన నిర్ధారణకు రాగలమని వైద్యులు చెప్పారు. అనంతరం వార్డులోకి వెళ్లి బాధితులతో బాలకృష్ణయ్య మాట్లాడారు. సకాలంలో వైద్య సేవలు అందిస్తున్నట్లు సిబ్బంది తెలిపారని బాలకృష్ణయ్య అన్నారు.

ఇదీ చదవండి: ఏలూరుకు కేంద్ర వైద్య బృందం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details