తూర్పుగోదావరి జిల్లాలో వశిష్ట గోదావరి వరద ముంపు ప్రాంతాల వాసులకు అమలాపురం ఎంపీ చింతా అనురాధ ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. వుదుమూడిలంక, బూరుగులంక జి.పెదపూడిలంక, అరిగెల వారిపేట గ్రామాలకు చెందిన రెండు వేల మంది వరద బాధితులు ఆహారం అందించారు. ఈ ప్రాంతంలో గోదావరి నదిపై వంతెన నిర్మించాలని బాధితులు కోరగా... ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీ అనురాధ భరోసా ఇచ్చారు.
వరద బాధితులకు ఎంపీ అనురాధ ఆహార పొట్లాలు పంపిణీ - అమలాపురం ఎంపీ
గోదావరి వరదల కారణంగా ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తినటానికి తిండి, తాగేందుకు నీరు లేక అవస్థ ఎదుర్కొంటున్నారు. వీరి కష్టాలను గమనించిన అమలాపురం ఎంపీ అనురాధ వరద బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు.
వరద బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ