ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్షుద్రపూజల కలకలం... భయాందోళనలో ప్రజలు - East Godavari District news

తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలం దుగ్గుదుర్రు గ్రామంలో క్షుద్రపూజలు గ్రామస్తులను భయాందోళనలకు గురి చేశాయి. స్థానికుల సమాచారంతో... పూజలు నిర్వహించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

క్షుద్రపూజల కలకలం

By

Published : Jul 23, 2019, 4:48 PM IST

క్షుద్రపూజల కలకలం

తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలం దుగ్గుదుర్రు గ్రామంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. అర్ధరాత్రి 12 గంటల సమయంలో గ్రామంలో కొందరు అనుమానాస్పదంగా తిరుగుతున్నారన్న స్థానికుల సమాచారంతో... పూజలు నిర్వహిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టగా... కాకినాడ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి దుగ్గుదుర్రులో ఇంటిని రెండేళ్ల క్రితం అద్దెకు తీసుకున్నాడని... తరుచూ ఇక్కడికి వచ్చి వెళ్తుంటారని పోలీసులు తెలిపారు. ఇళ్లు అద్దెకు తీసుకున్నవారు క్షుద్రపూజలు చేశారని తేలితే... చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గొల్లపాలెం ఎస్సై జాన్‌భాషా తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details