'చింతమనేనిని తప్పించాలి' - prabhakar
కుల దురహంకారి అయిన చింతమనేని ప్రభాకర్‌ను పదవి నుంచి తప్పించాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఆయనకు వ్యతిరేకంగా కాకినాడ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టాయి.
ఆందోళన చేస్తున్న దళిత సంఘాలు
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పదవినుంచి తప్పించాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. దళితులను కించపరుస్తూ మాట్లాడిన చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని... కాకినాడ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఆయన్ని వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేశారు.