యానాంలో నెల రోజుల వ్యవధిలో 60 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పుదుచ్చేరి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఒక ఐఏఎస్ అధికారిని నోడల్ ఆఫీసర్గా నియమించింది. పుదుచ్చేరి నుంచి యానాం చేరుకున్న ఐఏఎస్ అధికారి ఆకెళ్ల రవి ప్రకాష్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో విపత్తు నిర్వహణ, ఆరోగ్య, మున్సిపల్ పోలీసు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు..
ఇకపై యానాంలో ఒక్క కేసు కూడా నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలని రవిప్రకాష్ సూచించారు. భారీ తుపానులు, వరదలను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొన్నారని.. ఈ మహమ్మారిని కూడా ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సూచనలు తప్పక పాటించాలని విజ్ఞప్తి చేశారు. మాస్కులు ధరించటం, శానిటైజర్ వాడటం, దుకాణాల వద్ద భౌతికదూరం పాటించటం వంటివి తప్పనిసరిగా ఆచరించాలని సూచించారు.