రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి - husband
తూర్పుగోదావరి జిల్లా తుని మండలం చేపూరు జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు.
రోడ్డు ప్రమాదం ఘటనలో మహిళ మృతదేహం
రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని కబళించింది. మృత్యువులో కూడా తోడున్నారు ఆ దంపతులు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం చేపూరు జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ మృతి చెందారు. రాజమహేంద్రవరం నుంచి దార్లపూడి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న బైక్ ఒక్కసారిగా డివైడర్‌ను ఢీ కొట్టింది. భార్య అక్కడికక్కడే మృతి చెందగా.. గాయపడ్డ భర్తను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు.