ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రావులపాలెం ఎంప్లాయిస్​ కాలనీలో కరోనా అలజడి - తూర్పు గోదావరి కరోనా వార్తలు

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో కరోనా కలకలం రేగింది. మండపేటలో బ్యాంకు ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి... రావులపాలెంలోని తన కుటుంబసభ్యులను చూసేందుకు రెండ్రోజుల క్రితం వచ్చారు. తాజాగా ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో రావులపాలెం ఎంప్లాయిస్​ కాలనీలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు.

రావులపాలెం ఎంప్లాయిస్​ కాలనీలో కరోనా అలజడి
రావులపాలెం ఎంప్లాయిస్​ కాలనీలో కరోనా అలజడి

By

Published : Jun 28, 2020, 7:09 PM IST

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో కరోనా కలకలం రేపింది. రాజమహేంద్రవరానికి చెందిన భార్య భర్తలు ఇద్దరూ వేరు వేరు చోట్ల ఉద్యోగాలు చేస్తున్నారు. భర్త మండపేటలోని బ్యాంకు ఉద్యోగం చేస్తుండగా, భార్య రావులపాలెం తపాలా కార్యాలయంలో పనిచేస్తున్నారు. భార్య రావులపాలెంలోని ఎంప్లాయిస్ కాలనీలో నివాసం ఉంటున్నారు. మండపేట బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది.

ఆయన రెండ్రోజుల క్రితం రావులపాలెంలోని వారి కుటుంబ సభ్యుల వద్దకు వచ్చారు. ఈ నెల 24న జ్వరంగా ఉందని భార్య కూడా ఊబలంక పీహెచ్​సీలో కరోనా పరీక్ష చేయించుకున్నారు. ఈ పరీక్ష ఫలితాలు రావాల్సిఉంది. ఇంతలోనే భర్తకు పాజిటివ్ అని తేలడంతో ఎంప్లాయిస్ కాలనీలో పారిశుద్ధ్య పనులు చేపట్టినట్లు పంచాయతీ కార్యదర్శి దుర్గా ప్రసాద్ తెలిపారు.

ఇదీ చదవండి :విద్యార్థినిపై లైంగికదాడిలో కొత్తకోణం.. వీడియోలు సోదరుడికి పంపిన నిందితురాలు?

ABOUT THE AUTHOR

...view details