తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో తొలిసారిగా 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. పాజిటివ్ లక్షణాలు ఉన్నవారు కలిసిన వారి నమూనాలు సేకరించి పరీక్షించగా.. అవి నెగెటివ్ రావటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంటింటి సర్వే ద్వారా మరికొంతమంది నమూనాలు సేకరించి పరీక్షిస్తున్నామని తెలిపారు.
తునిలో 3 పాజిటివ్ కేసులు.. అప్రమత్తమైన అధికారులు - తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు
తూర్పు గోదావరి జిల్లా తునిలో 3 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో అధికారులు భద్రతా చర్యలు ముమ్మరం చేశారు. ఇంటింటి సర్వే నిర్వహిస్తూ అనుమానితుల నమూనాలు సేకరించి పరీక్షలకు పంపుతున్నారు.
తునిలో కరోనా పాజిటివ్ కేసులు