రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. మొత్తం 983 మందికి పరీక్షలు చేయగా.. తాజాగా వచ్చిన ఫలితాల్లో 247 మందికి పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. వీరిలో 10 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 30 మంది సిబ్బంది వైరస్ బారిన పడినట్లు వెల్లడించారు. కరోనా బాధితుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అందరికీ మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని.. మిగిలిన ఖైదీలు, సిబ్బందికి త్వరలో టెస్టులు చేయిస్తామని జైలు సూపరింటెండెంట్ రాజారావు వివరించారు.
రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో తాజాగా 247 మందికి పాజిటివ్ - రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో కరోనా కేసుల వార్తలు
రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో తాజాగా 247 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయినట్లు జైలు అధికారులు తెలిపారు. వీరిలో 10 మంది సిబ్బంది ఉన్నట్లు చెప్పారు. బాధితులందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు వివరించారు.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు