తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం మలికిపురం ఎంపీయూపీ పాఠశాలలో చదువుతున్న 11 మంది విద్యార్థులకు కరోనా సోకింది. పాఠశాలలో నాలుగు రోజుల కింద నలుగురు ఉపాధ్యాయులకు కరోనా సోకిన నేపథ్యంలో శనివారం 164 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 11 మంది విద్యార్థులకు పాటు మరో వ్యక్తికి కలిపి మొత్తం 12 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి ప్రతిమ తెలిపారు. వీరి ప్రైమరీ కాంటాక్ట్‌గా ఉన్న వారికి సోమవారం పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
మలికిపురం పాఠశాలలో కరోనా కలకలం - తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వార్తలు
తూర్పుగోదావరి జిల్లాలోని మలికిపురం పాఠశాలలో కరోనా కలకలం రేపింది. 11 మంది విద్యార్థులకు కరోనా సోకింది. ప్రైమరీ కాంటాక్ట్‌గా ఉన్న వారికి సోమవారం పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
మలికిపురం పాఠశాలలో కరోనా కలకలం