పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి యువరక్తం కావాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. కాకినాడ... తెదేపా విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు...పాతతరం అనుభవం, కొత్తతరం ఉత్సాహం రెండూ తెలుగుదేశానికి అవసరమని స్పష్టంచేశారు. మరో 30 ఏళ్ల వరకు నాయకుల్ని తయారు చేసే శక్తి తెలుగుదేశానికి ఉందన్న ఆయన... ప్రతీ సీనియర్ నేత ఓ యువ నాయకుడిని తయారు చేయాలని పిలుపునిచ్చారు. ఈ నూతన అధ్యయనానికి తూర్పుగోదావరి జిల్లా నుంచి శ్రీకారం చుడుతున్నామని చంద్రబాబు ప్రకటించారు.
తెదేపాలో యువరక్తం... తూర్పుగోదావరి నుంచే శ్రీకారం: చంద్రబాబు - chandababu
మరో 30 ఏళ్లు వరకు రాష్ట్రానికి నాయకుల్ని తయారు చేసే శక్తి తెలుగుదేశానికి ఉందని తెదేపా అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రతీ సీనియర్ నేత ఓ యువ నాయకుడిని తయారుచేయాలన్నారు. భవిష్యత్ అంతా యువ నేతలదే అని చంద్రబాబు తెలిపారు.
తెదేపాలో యువరక్తం...ఇక్కడ నుంచే నాంది : చంద్రబాబు
ఇదీ చదవండి: