పోలవరం విషయంలో కోర్టు తీర్పుపై ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నిలదీశారు. మీడియాతో ఇష్టాగోష్టిలో మాట్లాడిన ఆయన... పోలవరం పై హైకోర్టు తీర్పు గురించి తెలుసుకున్నారు. ఇది ఇక్కడితో ఆగదని... ఈ జాప్యం ప్రాజెక్టుపై ఇంకా ప్రభావం చూపుతుందన్నారు. ఎవరెన్ని చెప్పినా వినకుండా ప్రభుత్వం మూర్ఖంగా వెళ్లిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. పోలవరంపై ప్రయోగాలు వద్దని చెప్పినా వినలేదన్నారు. లేని అవినీతి నిరూపించాలని చూశారని వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డారు.
'ఇది ఇక్కడితో ఆగదు... పోలవరం ముందుకు సాగదు' - chandra babu
పోలవరం అంశంపై హైకోర్టు తీర్పుపై చంద్రబాబు స్పందించారు. దీనిపై ప్రభుత్వం ఏం చెప్తుందని ప్రశ్నించారు. లేని అవినీతి అంటగట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు