ఎస్సీ యువకుడు వరప్రసాద్‌కు తెదేపా అధినేత చంద్రబాబు రూ.2లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. పోలీసుల సమక్షంలో ఆ యువకుడికి శిరోముండనం చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల పట్ల వైకాపా నాయకులు, అధికార పార్టీ నేతలు దుర్మార్గాలను ఆపకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తప్పదని హెచ్చరించారు. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి... వారిని అణచివేసేలా వ్యవహరించడం సరికాదన్నారు.
శిరోముండనం వ్యవహారం: వరప్రసాద్‌కు చంద్రబాబు రూ.2లక్షల సాయం - శిరోముడనంపై చంద్రబాబు
శిరోముండనం వ్యవహారంలో ఎస్సీ యువకుడు వరప్రసాద్‌కు తెదేపా అధినేత చంద్రబాబు రూ.2లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. దళితుల పట్ల వైకాపా నాయకులు, అధికార పార్టీ నేతలు దుర్మార్గాలను ఆపకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామన్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు