ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాలయోగికి నివాళులర్పించిన ప్రముఖులు - బాలయోగి సమాధి వద్ద నివాళులు

లోక్ సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి వర్ధంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని ఆయన సమాధి వద్ద పలువురు రాజకీయ నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలయోగి చేసిన సేవలు ఆదర్శనీయమని కొనియాడారు.

బాలయోగి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రముఖులు
బాలయోగి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రముఖులు

By

Published : Mar 3, 2021, 4:58 PM IST

లోక్ సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి వర్ధంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని ఆయన సమాధి వద్ద శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమని సుబ్రమణ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో అమలాపురం మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, బాలయోగి కుమారుడు గంటి హరీష్ మాధుర్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:గుత్తులవారిపేటలో 10 కుటుంబాలను బహిష్కరించిన గ్రామపెద్దలు

ABOUT THE AUTHOR

...view details