తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం మర్రిగుంట వద్ద ఓ కారు ప్రధాన మురుగు కాలువల్లోకి దూసుకుపోయింది. కొత్తపేట మండలం అవిడి నుంచి పి గన్నవరం వస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఘటనలో కారు దెబ్బతింది. అందులో ప్రయాణిస్తున్న నలుగురు క్షేమంగా బయటపడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు ఆరా తీశారు.
అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. - east godavari
తూర్పుగోదావరి జిల్లా మర్రిగుంట వద్ద ఓ కారు అదుపుతప్పి మురుగుకాల్వలోకి దూసుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న నలుగురు క్షేమంగా బయటపడ్డారు.
కారు ప్రమాదం