ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP Crime News: మరదలిపై హత్యాయత్నం.. గిరిజన మహిళపై అత్యాచారం - east godavari news

Crime News in AP: చిన్నతనంలోనే చేరదీసి పెద్దవాడిని చేసి కూతురిని ఇచ్చి పెళ్లి చేసిన మేనమామనే మోసగించాడు మేనల్లుడు. ఇల్లరికం వచ్చి సొంత మరదలిపైనే హత్యకు యత్నించాడు. ఆమె మరణించిందని భయపడి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. మరోవైపు చర్చికి వచ్చే మహిళపై పాస్టర్​ కన్నేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ap crime
ap crime

By

Published : Jun 11, 2023, 10:49 AM IST

Crime News in AP: తండ్రి లేని పిల్లాడని మేనల్లుడిని చేరదీసి ఓ ప్రయోజకుడిని చేసి పెద్ద కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తే.. ఆ యువకుడు కన్న కూతురులా చూడాల్సిన సొంత మరదలిపై హత్యకు యత్నించాడు. ఆమె చనిపోయిందని భయపడి తాను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. పోతినీడు పాలేనికి చెందిన పెరవలి సుబ్బారావు, అరుణలకు వాణి, లీలాఅనూష అనే ఇద్దరు కుమార్తెలు. ఉమ్మడి పశ్చిమగోదావరి (ఏలూరు) జిల్లా భీమడోలుకు చెందిన తన అక్క కుమారుడు పెదపూడి సత్యనారాయణను సుబ్బారావు చిన్నతనంలోనే చేరదీశారు. 2020 ఆగస్టు 8న తన పెద్ద కుమార్తెను ఇచ్చి పెళ్లిచేసి ఇల్లరికం తెచ్చుకున్నారు. సత్యనారాయణ ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసి అందులో మరదలు లీలా అనూషతో పాటలు పాడించేవాడు. ఇటీవల ఆమెకు పెళ్లి కుదిరింది. ఇకపై తాను పాడనని బావతో చెప్పింది. కోపం పెంచుకున్న సత్యనారాయణ.. అనూషను చంపేయాలనుకున్నాడు.

గురువారం రాత్రి గ్రామంలో ఒక పెళ్లికి వీరి బ్యాండ్​ పార్టీ వెళ్లింది. మధ్యలో పని ఉందని చెప్పి 8 గంటల సమయంలో సత్యనారాయణ తన బండిపై అనూషను శివారులోని ఆయిల్​పామ్​ తోటలోకి తీసుకెళ్లి గొడవ పడ్డాడు. అనంతరం చాకుతో ఆమె గొంతులో పొడిచాడు. తీవ్ర రక్తస్రావమైన అనూష అక్కడే పడిపోవడంతో చనిపోయిందని భావించిన సత్యనారాయణ భయపడి.. భీమడోలు శివారులో ఉన్న కొండ్రుపాడు రైల్వేగేటు వద్దకు చేరాడు. అక్కడ తన చెల్లెలు ఝాన్సీకి ఫోన్​ చేసి, జరిగిన విషయం చెప్పాడు. అనంతరం అటుగా వెళ్లే రైలు కింద పడి మృతి చెందాడు. వెంటనే ఝాన్సీ కుటుంబసభ్యులకు చెప్పగా.. అర్ధరాత్రి రెండు గంటల పాటు వెతికిన స్థానికులు.. కొన ఊపిరితో ఉన్న అనూషను గుర్తించి తాడేపల్లిగూడెంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. సత్యనారాయణ మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మహిళపై పాస్టర్​ అత్యాచారం: తనపై పాస్టర్​ అత్యాచారం చేశారంటూ ఓ వివాహిత పోలీసులను ఆశ్రయించారు. నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలోని వైసీపీ కీలక నాయకుడికి విషయం తెలియడంతో ఆ దారుణానికి 40 వేలు రూపాయలు వెలకట్టిన ఘోరం శనివారం వెలుగు చూసింది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా ఇందుకూరు పేట మండలం ముదివర్తిపాలెంనకు చెందిన ఓ పాస్టర్.. చర్చికి వచ్చే వివాహితపై కన్నేశాడు. పని ఉందని ఇంటికి తీసుకెళ్లి తాళాలేసి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలు ఈ విషయాన్ని భర్తకు, తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఈ నెల 7వ తేదీన ఇందుకూరుపేట పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆ పాస్టర్ వైసీపీలోని ఓ కీలక నేతను ఆశ్రయించారు. ఆయన కేసు వాపసు తీసుకోవాలని బాధితురాలితో పాటు కుటుంబ సభ్యులను బెదిరించారు. 40 వేల రూపాయలు బాధితురాలికి, పోలీసులకు 10 వేల రూపాయలు ఇచ్చేలా సర్పంచ్​ ఆ పత్రంపై సంతకాలు చేయించారు. అయినప్పటికీ బాధిత కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. గ్రామ పెద్దలు, పోలీసులు ఎంత ఒత్తిడి చేసినా, వారు ఇచ్చే డబ్బులు తీసుకోలేదని, తనకు న్యాయం చేయాలని బాధితురాలు విలపించారు. దీనిపై ఎస్సై రాజేష్​ను వివరణ కోరగా ఇరువర్గాలు రాజీ పడ్డాయని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details