తూర్పు గోదావరి జిల్లా మలికిపురంలో రాజోలు నియోజకవర్గ జనసేన కార్యకర్తలు స్థానిక జీఎంఆర్ గ్రౌండ్స్‌లో బహిరంగసభను ఏర్పాటు చేశారు . దీనికి పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జనసైనికులు సభా ప్రాంగణం ఎదుట రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు వినూత్న రీతితో నిరసన తెలిపారు. రాపాకకు సభా ప్రాంగణంలోకి అనుమతి లేదంటూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. అయితే కొద్ది సేపటి తర్వాత జనసేన పార్టీ సీనియర్ నాయకులు సదరు బ్యానర్‌ను తొలగించారు. గత కొంత కాలంగా జనసేన ఎమ్మెల్యే రాపాక పార్టీకి దూరంగా ఉంటూ వైకాపాకు మద్దతు తెలుపుతున్నారు. ఈ విషయంపై జనసైనికులు ఆయనపై గుర్రుగా ఉన్నారు.
రాపాకకు ప్రవేశం లేదంటూ బ్యానర్.. జనసైనికుల వినూత్న నిరసన - rapaka latest news
రాజోలులో జనసేన తరఫున ఎన్నికల్లో గెలుపొంది... వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న రాపాక వరప్రసాద్‌కు జనసైనికులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. జనసేన రాజోలు నియోజక వర్గ కార్యకర్తలు బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ సభకు రాపాకకు ప్రవేశం లేదంటూ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు.
రాపాకకు ప్రవేశం లేదంటూ బ్యానర్.. జనసైనికుల వినూత్న నిరసన