తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలోని పలు లాడ్జీల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని అదుపులోకి తీసుకొని కోర్టుకు హాజరుపరిచారు. ఇతర ప్రాంతాల నుంచి పని నిమిత్తం వచ్చే వారు ఇలాంటి కార్యకలపాలకు పాల్పడుతున్నారని పోలీసులు వెల్లడించారు. గదులను ఇచ్చే ముందు కస్టమర్ల పూర్తి వివరాలతోపాటు గుర్తింపు కార్డు జిరాక్స్ సైతం తీసుకోవాలని లాడ్జి యాజమానులను హెచ్చరించారు.
లాడ్జిల్లో అసాంఘిక కార్యకలపాలు- 13 మంది అరెస్ట్ - ladge
లాడ్జిల్లో అసాంఘిక కార్యకలపాలకు పాల్పడుతున్న13 మందిని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు.
13 మంది అరెస్ట్