తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు చేతికందే సమయంలో వర్షం రూపంలో నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడం వల్ల అధిక ఉష్ణోగ్రత కారణంగా రంగు మారి పగిలిపోతుందని రైతులు వాపోతున్నారు. మరోపక్క కోత దశలో ఉన్న వరి పైరు వేగమైన గాలుల తీవ్రతకు పూర్తిగా నేలవాలింది. ఎకరాకు 25 వేలు వరకు పెట్టుబడి పెట్టి పంట చేతికందే సమయానికి నష్టపోయామని ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి - govt
ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికందే సమయానికి వర్షం రూపంలో నష్టం వాటిల్లడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది.
నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి