అమ్మ అనే పదంలోని అర్థాన్ని, పరమార్ధాన్ని మర్చిపోతుంది నేటితరం.... ఆర్థికపరమైన ఇబ్బందులు, పని భారం, భార్యాభర్తల మధ్య సమన్వయ లోపం తల్లుల పాలిట శాపంగా మారింది. మనుమలు, మనుమరాళ్లను ఆడిస్తూ ... ఆనందించాల్సిన వయసులో అనాథ ఆశ్రమాల్లో ఆశ్రయం పొందాల్సి వస్తోంది. తమకంటూ ఒకరోజు ఉందని తెలియని వృద్ధాశ్రమాలలో జీవనం సాగిస్తున్న తల్లులను ఆదరించే దాతలు ముందుకు రావడంతో వారిజీవితం ఆనందంగానే సాగిపోతోంది. పేగు బంధం పక్కన లేదన్న వెలితే... తప్ప కేంద్రపాలిత యానం వృద్ధాశ్రమంలో 20 సంవత్సరాలుగా సుమారు 30 మంది మాతృమూర్తులు ఆనందంగా జీవిస్తున్నారు.
పేగు బంధం పొమ్మంది... ఆశ్రమం రమ్మంది
మాతృమూర్తులను పేగుబంధం వెలివేసింది. అయితేనేం... కేంద్రపాలిత యానాం రమ్మంది. వృద్ధాశ్రమంలో 30 ఏళ్లుగా ఆనందంగా జీవిస్తున్నారంటే... అక్కడి నిర్వహన ఎలా ఉందో ఇట్టే అర్థమవుతోంది.
అమ్మనాదరిస్తున్న ఆశ్రయాలు