తూర్పుగోదావరి జిల్లాలోని 4 వేల 581 పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలు, వీవీపాట్‌లు కాకినాడ చేరుకున్నాయి. నగరంలోని ఆరు చోట్ల ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లలో అధికారులు వాటిని భద్రపర్చారు. కలెక్టర్ కార్తికేయమిశ్రా, అభ్యర్ధులు, పర్యవేక్షకుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లకు సీల్ వేశారు. పారా మిలటరీ బలగాలతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ రోజు వరకూ భద్రత కొనసాగుతుందని ఉన్నతాధికారులు చెప్పారు.
భద్రతా బలగాల పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూములకు సీల్ - kakinada
తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ పూర్తి చేసుకున్న ఈవీఎంలను... కాకినాడలో ఆరు చోట్ల ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించి సీల్ వేశారు.
భారీబలగాల పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూమ్‌లకు సీల్