దిల్లీ నుంచి విశాఖపట్టణం వెళ్లే ఏపీ ఎసీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఏసీలు పనిచేయటం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఆదివారం రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం 2.32 గంటలకు రాజమహేంద్రవరానికి చేరుకోగానే ప్రయాణికులంతా ఒక్కసారిగా రైలు దిగి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. రైలు బయల్దేరినప్పటి నుంచి ఇదే సమస్య ఉందని.. మధ్యలో ఝాన్సీ, భోపాల్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని తాము ఎంతో ఇబ్బందులు పడ్డామని తెలిపారు. విజయవాడ నుంచి మొత్తం అన్ని బోగీల్లో ఏసీ పనిచేయటంలేదని ఫిర్యాదు చేస్తే.. తర్వాతి స్టేషన్లో మరమ్మతులు చేస్తారని అధికారులు తెలిపారన్నారు. రైలులో ఒక్క ఏసీ పనిచేయకపోవటంతో తీవ్ర ఉక్కపోతతో కూర్చోలేకపోయామన్నారు. అధికారులు, సిబ్బంది రాజమహేంద్రవరంలో మరమ్మతులు చేసే ప్రయత్నం చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. అప్పటికప్పడు 400 ప్రయాణికుల కోసం ప్రత్యేక రైలును ఏర్పాటు చేసి సాయంత్రం 5.52 గంటల సమయంలో విశాఖపట్నానికి పంపారు. టికెట్ ధరలో వ్యత్యాసాన్ని విశాఖపట్నంలో వాపసు ఇస్తామని అధికారులు తెలిపారు.
మాకొద్దు బాబోయ్ ఈ రైలు ప్రయాణం - delhi
ఏపీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం నరకప్రాయం అవుతోంది. తరచూ ఏసీలు పనిచేయక పోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఏపీ ఏసీ ఎక్స్‌ప్రెస్