తూర్పుగోదావరి జిల్లా(east godavari district) సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం గ్రామం సముద్ర పోటుకు గురి అయింది. అమావాస్య కావడంతో సాగర సంగమం వద్ద సముద్రపు కెరటాలు ఎగసిపడి గోదావరిలోకి చేరడంతో.. చెంతనే ఉన్న పల్లిపాలెం గ్రామంలోకి వరద నీరు(Flood water) ప్రవేశించింది. గ్రామంలోని ఇళ్లు, పాఠశాలలోకి భారీగా నీరు చేరింది. దీంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. సముద్రపు పోటు నీరు గ్రామంలోకి చేరకుండా రక్షణ గోడ నిర్మించాలని స్థానిక ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
అంతర్వేదిలో పోటెత్తిన సముద్రం..ఇళ్లలోకి చేరిన నీరు - తూర్పుగోదావరి జిల్లా వార్తలు
తూర్పుగోదావరి జిల్లా(east godavari district) అంతర్వేది పల్లిపాలెం గ్రామం సముద్ర పోటుకు గురైంది. గ్రామంలోని ఇళ్లు, పాఠశాల ఆవరణలోకి వరద నీరు(Flood water) ప్రవేశించింది.
సముద్ర పోటు