తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గత వారం జరిగిన బోటు ప్రమాదంలో మృతి చెందిన 76 మందికి బోటు యాజమాన్యం తరుఫున ఇన్సూరెన్స్ అందిస్తామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మీ ప్రకటించారు. రాయల్ వశిష్ట పున్నమి బోటు యాజమాన్యం... బోటుకు 45 లక్షలు, ప్రయాణికులకు ఒక్కొక్కరికి 10 లక్షలు ఇన్సూరెన్స్ చేయించిందని ఆ మొత్తం న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీ ద్వారా చెల్లిస్తామని తెలిపారు. మొత్తం 76 మందికి ఇన్సూరెన్స్ బీమా చెల్లిస్తామని చెప్పారు. ప్రభుత్వం అందించే 10 లక్షల సాయానికి ఇది అదనమని ఎస్పీ చెప్పారు. రాజమహేంద్రవరం నగర జిల్లా ఎస్పీ షిమోషీబాజ్‌పాయ్, ఇన్సూరెన్స్ అధికారి రజనీ కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. రాజమహేంద్రవరం నగర జిల్లా ఎస్పీ కార్యాలయంలో రేపు సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. బాధితులు సలహాలు, సూచనల కోసం 9440796395, 9700001818 నెంబర్లకు ఫోన్ చేయాలని కోరారు. బోటు ప్రమాదానికి కారణాలపై పూర్తిస్థాయిలో ధర్యాప్తు జరుగుతోందని ఇప్పటివరకూ ఐదుగురిని అరెస్టు చేశామని ఎస్పీ చెప్పారు. బోటు తీయడానికి ఎవరైనా ముందుకొస్తే కలెక్టర్, ఎస్పీలను కలవొచ్చని చెప్పారు. ఇంకా 15మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉందని ఎస్పీ నయీం అస్మీ చెప్పారు
పోలీసు శాఖ తప్పు లేదు