ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్నవరం దేవస్థానంలో యథావిధిగా ప్రసాద విక్రయాలు - అన్నవరం దేవస్థానం

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో ప్రసాదాలను కొండ దిగువన తొలి పావంచాలు, నమూనాలయం వద్ద విక్రయిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ప్రసాద విక్రయాలు చేపడుతున్నారు.

annavaram temple prasadam sales
అన్నవరం దేవస్థానంలో యథావిధిగా ప్రసాద విక్రయాలు

By

Published : Jun 28, 2020, 7:38 PM IST

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో ప్రసాదాలను యథావిధిగా కొండ దిగువన తొలి పావంచాలు, నమూనాలయం వద్ద విక్రయిస్తున్నారు. కరోనా కారణంగా ఇటీవల అక్కడ ప్రసాదం విక్రయం నిషేధించారు. లాక్ డౌన్ సడలింపులతో దైవ దర్శనానికి ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అనుమతిచ్చారు.

ప్రసాద విక్రయానికీ అనుమతి ఇవ్వాలని ఆలయ వర్గాలు రెవెన్యు అధికారులను కోరగా వారు అనుమతించారు. దీంతో ఎప్పట్లానే కొండ దిగువన మెట్ల మార్గం వద్ద ప్రసాదం విక్రయిస్తున్నారు.

ఇవీ చదవండి... ; 'పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ప్రతిపక్షం ఓర్వలేకపోతోంది'

ABOUT THE AUTHOR

...view details